Climax Movie: రాజేంద్ర ప్రసాద్, శ్రీ రెడ్డి 'క్లైమాక్స్'.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే!

Climax Movie: నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్లైమాక్స్'.

Samba Siva Rao
Updated on: 31 March 2021 1:52 PM IST
climax on ott release
X

క్లైమాక్స్ మూవీ ఫైల్ ఫోటో 

Climax Movie: నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్లైమాక్స్'. విభిన్నమైన కథ, కథనాలతో, విచిత్ర కాన్సెప్ట్‌తో క్లైమాక్స్ మూవీ రూపొందింది. మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్, బ్యాక్ డ్రాప్ కామెడీతోపాటు కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ను సరికొత్తగా చూపించారు దర్శకుడు. ఈ చిత్రం మార్చి తొలివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రాలేదు. ఈ సినిమాను ఓటీటీలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్న డ్రీమ్ మూవీ దర్శకుడు భవానీ శంకర్ డైరక్షన్‌లో క్లైమాక్స్ చిత్రాన్ని రూపొందించాడు. బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలపై, రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలను సంధించిన చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. విజయ్ మోడీగా నటించిన రాజేంద్రప్రసాద్ గెటప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ క్లైమాక్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ రెండోవారంలో క్లైమాక్స్ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీరెడ్డి కీలక పాత్రలో నటించింది. క్లైమాక్స్ కథా కథనం బాగున్నప్పటికీ థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించడంతో కాస్త వెనకబడింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు కూడా ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. నాంది, గాలి సంపత్, జాంబిరెడ్డి వంటి చిత్రాలు ఓటీటీ మంచి ఆదరణ లభించింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story