Drugs Case: డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్

Drugs Case: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 1 July 2021 4:50 PM IST
Clean Chit to 11 Movie Celebrities in Drugs Case
X

Drugs Case: డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ 

Drugs Case: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నాలుగేళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ కు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి 27 మందిని విచారించినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఛార్జిషీట్ లో తెలిపారు. 12 కేసుల్లో తొలుత ఎనిమిది కేసుల్లో మాత్రమే అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. ఎక్సైజ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు రావడంతో మరో నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. 11 మంది సినీ ప్రముఖులతో పాటు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసులును ఎక్సైజ్ పోలీసులు విచారించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story