"పుష్ప" లో సాయి పల్లవి పాత్ర పై క్లారిటీ

Clarity on Sai Pallavi Role in Pushpa 2 Movie
x

"పుష్ప" లో సాయి పల్లవి పాత్ర పై క్లారిటీ

Highlights

*సాయి పల్లవి పుకార్లపై రియాక్ట్ అయిన "పుష్ప" బృందం

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పట్టాలెక్కింది. అయితే గత కొంతకాలంగా "పుష్ప" రెండవ పార్ట్ కథ గురించి నటీనటుల గురించి ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి.

అందులో ఒకటి ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సాయి పల్లవి కూడా కీలక పాత్రలో కనిపిస్తోంది అని. ఈ సినిమాలో సాయి పల్లవి ఒక ట్రైబల్ అమ్మాయిగా కనిపించబోతోంది అని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై రియాక్ట్ అయింది చిత్ర బృందం. సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కేవలం రష్మిక మందన్న మాత్రమే ఉంటుందని మరో హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాలో లేదని, అలానే సాయి పల్లవికి కూడా సినిమా ఆఫర్ వెళ్ళలేదని చెప్పుకొచ్చింది చిత్ర బృందం. దీంతో ఎప్పటినుంచో బన్నీ సరసన సాయి పల్లవిని చూడాలనుకున్న ఆమె అభిమానులు కొంత నిరాశ చెందారని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories