రామ్ చరణ్ సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్

Cinematographer Thiruu Left From Ram Charan RC15
x

రామ్ చరణ్ సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్

Highlights

Ram Charan: శంకర్ తో సినిమా కోసం మరొక సినిమాటోగ్రాఫర్ ని రంగంలోకి దింపిన రామ్ చరణ్

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయాల్సిన తిరు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తిరు వేరే సినిమాతో కూడా బిజీగా ఉండటంవల్ల శంకర్ మరియు రామ్ చరణ్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ సినిమా నుంచి తిరు తనంతట తానుగా తప్పుకున్నట్లు కొందరు చెబుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం తిరు మరియు రామ్ చరణ్ శంకరులకు మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే తిరు ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ని రంగంలోకి దింపారు చెర్రీ. ఇక ఈ సినిమా కోసం రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. గతంలో రత్నవేలు రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories