Mahesh Babu: గుంటూరు కారంకి మరో ఎదురు దెబ్బ.. సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్..

Mahesh Babu: మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ, ఆది నుండీ అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి.

Arun Chilukuri
Updated on: 22 July 2023 3:56 PM IST
Cinematographer PS Vinod Walks out of Guntur Kaaram
X

Mahesh Babu: గుంటూరు కారంకి మరో ఎదురు దెబ్బ.. సినిమా నుంచి టాప్ టెక్నీషియన్ అవుట్‌..

Mahesh Babu: మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ, ఆది నుండీ అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. సినిమా ఎప్పుడో షూటింగ్ మొదలవ్వాలి, ఈమధ్యనే మొదలెట్టారు, పూజ హెగ్డే సినిమా నుండి వచ్చేసింది, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమా నుండు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కారణాలేమిటో తెలీదు కానీ.. ఆయన ‘గుంటూరు కారం’ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారట.

నిజానికి త్రివిక్రమ్‌తో పి.ఎస్.వినోద్‌కు మంచి రాపో ఉంది. ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురములో’, ‘వకీల్ సాబ్’ సినిమాలకు త్రివిక్రమ్‌తో కలిసి వినోద్ పనిచేశారు. ఈ రాపోతోనే ‘గుంటూరు కారం’ సినిమాకు కూడా ఆయన్నే తీసుకున్నారు. సినిమాను సాగదీస్తున్నారనో ఏమో కానీ పి.ఎస్.వినోద్ మధ్యలోనే జెండా ఎత్తేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌లు‌గా మొదట పూజా హెగ్డే, శ్రీలీలను ఖరారు చేశారు. పూజా హెగ్డేతో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

కానీ, ఆమె మధ్యలో డ్రాప్ అయ్యారు. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడు వినోద్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే షూటింగ్ వెంటనే మళ్ళీ మొదలెట్టాలి అనుకుంటే, సినిమాటోగ్రాఫర్ చాలా ముఖ్యం, వెంటనే ఎవరినైనా తీసుకోవాలి. ఇప్పుడు వినోద్ మానెయ్యటంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఈ 'గుంటూరు కారం' కథ అని అంటున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్ టైం మెంట్ సంస్థ నిర్మిస్తోంది, నాగ వంశీ నిర్మాత.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story