Cinema Theaters: జూలైలో థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలో థియేటర్స్ మేనేజ్‌మెంట్

Cinema Theaters to Open In July
x

ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా

Highlights

Cinema Theaters: కరోనా ఫస్ట్ వేవ్‌తో అప్పుడప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది.

Cinema Theaters: కరోనా ఫస్ట్ వేవ్‌తో అప్పుడప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సడలింపుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే జూలైలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రిలీజ్‌కు సినిమాలు సిద్దంగా లేవన్నది ప్రస్తుత టాక్.

రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపులతో జూలై నెలలో ధియేటర్లు ఓపెన్ చేసే ఆలోచలో ఉంది ధియేటర్స్ మేనేజ్‌మెంట్. వాస్తవానికి థియేటర్లు క్లోజ్ చెయ్యమని ప్రభుత్వం చెప్పనప్పటికీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో చిత్ర పరిశ్రమనే షూటింగ్స్, ధియేటర్లను క్లోజ్ చేసింది. ఇప్పటికే కరోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఓపెన్ కాకపోతే పీకల్లోతు నష్టాలు తప్పవని అంటున్నాయి సినీ వర్గాలు.

ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వటంతో 50 శాతం ఆక్యూపెన్సీతో ధియేటర్లను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో వున్నారు థియేటర్స్ యజమాన్యాలు. కానీ కొత్త సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా లేకపోవటం సమస్యగా మారింది. అయితే త్వరగా షూటింగ్స్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఆర్టిస్ట్‌ల డేట్స్ ఎడ్జ్‌స్ట్మెంట్ చేస్తూ షూటింగ్‌లు స్టార్ట్ చేశారు. ఇప్పటికే హీరో నితిన్ మ్యాస్ట్రో మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. చిన్న సినిమాలు, సగం షూటింగ్ కంప్లీట్ అయిన సినిమాలు త్వరగా కంప్లిట్ చేసి థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి చిత్ర యూనిట్స్. మొత్తానికి సినిమా షూటింగ్స్‌తో టాలీవుడ్ మళ్లీ కళకళలాడబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories