ఫ్లాప్ హీరో సినిమాకి 15 కోట్లు

Ruthvik
Published on: 6 March 2019 1:05 PM IST
ఫ్లాప్ హీరో సినిమాకి 15 కోట్లు
X

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మధ్యనే 'తేజ్ ఐ లవ్యూ' అనే సినిమాతో మరొక పెద్ద డిజాస్టర్ ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తాజాగా 'చిత్రలహరి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' ఫేమ్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ని పరాజయాలను అందుకున్నప్పటికీ సాయి ధరంతేజ్ మార్కెట్ పై అవి పెద్దగా ప్రభావం చూపక పోవడం విశేషం.

తాజా సమాచారం ప్రకారం 'చిత్రలహరి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ అయితే సాయి ధరంతేజ్ మార్కెట్ మళ్ళీ బాగా పెరిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story