logo
సినిమా

వెకేషన్ మూడ్‌లో మెగాస్టార్.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్‌ కామెంట్‌

Chiranjeevi First Holiday Trip Since the Pandemic
X

వెకేషన్ మూడ్‌లో మెగాస్టార్.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్‌ కామెంట్‌

Highlights

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ,భార్య సురేఖ తో కలిసి వెకేషన్ కు వెళ్లారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ,భార్య సురేఖ తో కలిసి వెకేషన్ కు వెళ్లారు. పాండమిక్ అనంతరం అమెరికా , యూరప్ టూర్ కు వెళుతున్నట్లు సురేఖ తో కలిసి ఉన్న ఫోటొ ను చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆచార్య రిలీజ్ తో పాటు మరో రెండు సినిమాల చిత్రీకరణలతో అలసిపోయిన మెగాస్టార్ కాస్త రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.. నిజానికి కరోనాకు ముందు ప్రతి ఏడాది భార్యతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారు చిరంజీవి. ‌రెండేళ్లుగా అది కుదరలేదు.

ఇక తాజాగా రెండు వారాల టూర్ పూర్తవగానే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ , భోళా శంకర్ సినిమాల చిత్రీకరణ లో పాల్గొనున్నారు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. 'ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌'అని శ్రీజ, 'హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య' అని ఉపాసన కామెంట్‌ చేశారు.


Web TitleChiranjeevi's First Holiday Trip Since the Pandemic
Next Story