ఆచార్య విడుదల విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

*ఆచార్య విడుదల విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

Rama Rao
Updated on: 28 April 2022 7:15 PM IST
Chiranjeevis Acharya Movie will be Released Tomorrow
X

ఆచార్య విడుదల విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించిన "ఆచార్య" సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన కొరటాల శివ ఈ సినిమా కోసం ఒక సోషల్ మెసేజ్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఎలాంటి పెద్ద సినిమా అయినా విడుదలకు వారం రోజుల ముందు నుంచే ఓవర్సీస్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఇప్పటికీ ఓవర్సీస్ లోని కొన్ని లొకేషన్లలో ఈ సినిమా టిక్కెట్లు ఇంకా పెట్టకపోవటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు అలాంటి దేశాల్లో భారీ రిలీజ్ లు ప్లాన్ చేస్తారు. కానీ చూస్తూ ఉంటే "ఆచార్య" విషయంలో అభిమానులు నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story