రవితేజ పోస్టర్ తుడిచిన చిరంజీవి

Chiranjeevi Wiped Ravi Teja Poster
x

రవితేజ పోస్టర్ తుడిచిన చిరంజీవి

Highlights

* చిరంజీవి పోస్టర్ సన్నివేశం రవితేజ కష్టానికి ఫలితం అని అంటున్న అభిమానులు

Raviteja: ఈ మధ్యనే "ధమాకా" సినిమాతో మంచి హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి సందర్భంగా కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్లో విడుదలైన ఈ సినిమా రవితేజ కి మరొక బ్లాక్ బస్టర్ ని అందించింది.

అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో చిరంజీవి రోడ్డుమీద బురద పడి ఉన్న రవితేజ పోస్టర్ను తుడుస్తారు. ఆ సీన్ ప్రేక్షకులకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు రవితేజ అభిమానులు దీనిని మరొక సీన్ తో పోలుస్తున్నారు. గతంలో రవితేజ నటించిన "సింధూరం" సినిమాలో కూడా రవితేజ ఒక రోడ్డు మీద చిరంజీవి పోస్టర్లు తుడుస్తారు. ఒక చిన్న సినిమాలో చిన్న పాత్ర చేస్తూ చిరంజీవి పోస్టర్ తుడిచిన రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్ గా మారి అదే చిరంజీవి తనే పోస్టర్ని తుడిచే స్థాయికి ఎదిగారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇదే నిజమైన సక్సెస్ అని రవితేజ ఎందరో యువ హీరోలకి ఇన్స్పిరేషన్ అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య మరియు సింధూరం సినిమాలకి సంబంధించిన ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. శృతిహాసన్ మరియు క్యాథరిన్ తెరిసా హీరోయిన్లుగా నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories