Chiranjeevi: మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో కోట్ల మందికి ఆనందాన్నిచ్చావు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Arun Chilukuri
Updated on: 20 Jun 2023 12:30 PM IST
Chiranjeevi Welcomes Mega Princes
X

Chiranjeevi: మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో కోట్ల మందికి ఆనందాన్నిచ్చావు..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అపోలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉపాసనకు వేకువజామున పురుడుపోశారు. తల్లీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. దీంతో హీరో రాంచరణ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ రావడంతో అభిమానులంతా సంబరాలు జరుపుకుంటున్నారు.

తాజాగా మనవరాలి రాకపై మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ పెట్టారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం !! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికి ఆనందాన్ని పంచావ్‌.. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రాండ్‌ పేరెంట్స్‌గా గర్వంగా కూడా ఉంది. నిన్ను కోట్లాది మంది మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు ఆశీర్వదిస్తారు'. అని ట్విట్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story