కుటుంబంతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీని చూసిన చిరు

*యావత్ చిత్రబృందానికి చిరంజీవి అభినందనలు *మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ రాజమౌళిపై ప్రశంసలు

Rama Rao
Published on: 25 March 2022 5:18 PM IST
Chiranjeevi Watched RRR Movie with Family | Telugu News
X

కుటుంబంతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీని చూసిన చిరు

RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన‌‌లో వచ్చిన ట్రిపుల్ ఆర్ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. బెనిఫిట్ షోలతో ఒక రోజు ముందు నుంచే మోగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులతో పాటు సెలబ్రిటీలు అని తేడా లేకుండా.. ఈ సినిమాను చూడటానికి క్యూ కడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాను హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో భార్య సురేఖతో పాటు చిరంజీవి తల్లి అంజనా దేవితో కలిసి సినిమా చూశారు. కథలను తెరకెక్కించడంలో మాస్టర్ అనిపించుకున్న వ్యక్తి నుంచి వచ్చిన అద్భుత కళాఖండం ట్రిపుల్ అని చిరంజీవి ట్వీట్ చేశారు. యావత్ చిత్రబృందానికి హ్యాట్సాఫ్ చెప్పారు చిరు.

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ఎఎంబి మాల్ లో ఈ రోజు ఉదయం వీక్షించారు. ‌చిరంజీవి ,సురేఖ తో పాటు చిరంజీవి తల్లి అంజనా దేవి దియేటర్ కు వచ్చి సినిమాను ప్రత్యేకంగా చూసారు. అనంతరం ఆర్ ఆర్ ఆర్ సినిమా తమను ఎంతో ఆకట్టుకుందని చిరంజీవి చిత్ర యూనిట్ కు ట్వీట్ ద్వారా విషెష్ ను తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story