దిల్ రాజు కాంట్రవర్సీ పై మౌనం వహించిన చిరంజీవి

Chiranjeevi: దిల్ రాజు గురించి నోరు విప్పని మెగాస్టార్

Jyothi
Updated on: 29 Dec 2022 11:51 AM IST
Chiranjeevi Was Silent on the Dil Raju Controversy
X

దిల్ రాజు కాంట్రవర్సీ పై మౌనం వహించిన చిరంజీవి

Chiranjeevi: ప్రతి ఏడది లాగానే వచ్చే ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదల కి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి మైగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "వాల్తేరు వీరయ్య". తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించింది చిత్రబృందం. ఇందులో పాల్గొన్న చిత్ర యూనిట్ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అయితే చాలా వరకు ప్రశ్నలు మెగాస్టార్ చిరంజీవిని అడగటం జరిగింది.

అందులో అన్నిటికీ చాలా ఓపికగా జవాబులు చెప్పిన చిరంజీవి కేవలం ఒక్క ప్రశ్నను మాత్రం చాలా పొలైట్ గా అవాయిడ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇంతకీ చిరంజీవి అవాయిడ్ చేసిన ఆ ప్రశ్న దిల్ రాజు వివాదం గురించి. దిల్ రాజు నిర్మిస్తున్న డబ్బింగ్ సినిమా "వారసుడు" కి ఎక్కువ థియేటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. "వాల్తేరు వీరయ్య", "వీర సింహారెడ్డి" సినిమాల కంటే "వారసుడు" సినిమాకి ఎక్కువ థియేటర్లు రావడంతో అందరూ దిల్ రాజు పై మండిపడుతున్నారు.

కానీ దిల్ రాజు మాత్రం వీటిని పట్టించుకోకుండా "వారసుడు" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆఖరికి 10 కోట్ల మార్కెట్ కూడా లేని విజయ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం పై ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. "వాల్తేరు వీరయ్య" సినిమా ప్రమోషన్స్ లో ఉన్న చిరంజీవికి కూడా దీని గురించిన ప్రశ్న ఎదురైంది. కానీ ఈ విషయంలో చిరంజీవి ఏం మాట్లాడినా అది దిల్ రాజు తో పాటు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రశ్నలకు మౌనం వహించారు. చాలా సైలెంట్ గా మరియు పొలైట్ గా ఈ ప్రశ్నలను దాటివేశారు.

Jyothi

Jyothi

Next Story