Chiranjeevi: మెహర్ రమేష్ సినిమాని పక్కకు పెట్టిన మెగాస్టార్

* మెహర్ రమేష్ స్క్రిప్ట్ పూర్తి చేసే సమయంలో చిరంజీవి బాబి దర్శకత్వంలో సినిమా షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు

admin1
Updated on: 30 Sept 2021 3:27 PM IST
Chiranjeevi want to Change Meher Ramesh Script and Start Shooting with Bobby
X

చిరంజీవి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు "ఆచార్య" మరియు "గాడ్ ఫాదర్'' సినిమా షూటింగులతో బిజీగా ఉన్న చిరంజీవి త్వరలోనే "భోళా శంకర్" సినిమా షూటింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "వేదాళం" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ సినిమా ని పక్కకు పెట్టి మరొక సినిమాపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారట.

మెహర్ రమేష్ రాసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి పూర్తిగా నచ్చలేదట. అందుకే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని తెలుస్తోంది. చిరంజీవి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ స్క్రిప్ట్ పూర్తి చేసే సమయంలో చిరంజీవి బాబి దర్శకత్వంలో సినిమా షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు అని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

admin1

admin1

Next Story