హోస్ట్ చేసిన పనికి వాక్ ఔట్ చేసిన మెగాస్టార్

Chiranjeevi Walked Out of Show Shooting | Tollywood News
x

హోస్ట్ చేసిన పనికి వాక్ ఔట్ చేసిన మెగాస్టార్

Highlights

*హోస్ట్ చేసిన పనికి వాక్ ఔట్ చేసిన మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చాలా కూల్ గా ఉంటారు. ఉదయం షూటింగ్ మొదలైనప్పటి నుండి అర్థరాత్రి అయినప్పటికీ చిరు మాత్రం అంతే ఎనర్జిటిక్ గా సెట్ లో అందరితోనూ సరదాగా ఉంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ లు కూడా చెప్పారు. కానీ అప్పుడప్పుడు చిరంజీవి వంటి సహనం ఉన్న స్టార్ నటులకు కూడా విసుగు వస్తూ ఉంటుంది.తాజాగా ఒక షో షూటింగ్ సమయంలో చిరు కు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ హోస్ట్ లు చేసిన ఒక తప్పు వల్ల కోపం తెచ్చుకున్న చిరంజీవి ఆ షో షూటింగ్ నుండి వాక్ ఔట్ చేశారు.

తాజాగా ఈ వార్త నెట్లో వైరల్ గా మారింది.దాదాపు షూటింగ్ పూర్తయింది అనుకున్న సమయంలో ఆ షో హోస్ట్ లలో ఒక హోస్ట్ స్పాన్సర్ పేరు తప్పు చదవడం తో మళ్ళీ రీటేక్ అనడంతో విసుగు చెందిన చిరంజీవి ఏమి అనలేక షో నుండి వాక్ ఔట్ చేసేసారట.మరి ఆ షో గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా చూస్తే చిరంజీవి చేతిలో ఇప్పుడు "గాడ్ ఫాదర్", "వాల్తేర్ వీరయ్య", "భోళా శంకర్" వంటి సినిమాలు ఉన్నాయి. "ఆచార్య" తో డిజాస్టర్ అందుకున్న చిరు తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories