Chiranjeevi: వెంకీ కుడుములకి నో చెప్పిన చిరంజీవి

Chiranjeevi: "ఆచార్య" సినిమాతో ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 17 Sept 2022 6:02 PM IST
Chiranjeevi - Venky Kudumula Film Shelved
X

Chiranjeevi: వెంకీ కుడుములకి నో చెప్పిన చిరంజీవి

Chiranjeevi: "ఆచార్య" సినిమాతో ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాలపై బజ్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు కానీ చిరు దగ్గర పెద్ద లైనప్ ఉంది. మోహన్ రాజా డైరెక్షన్ లో "గాడ్ ఫాదర్", మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలు చేయనున్నారు. "వాల్తేరు వీరయ్య" సినిమాతో కూడా బిజీగా ఉన్న చిరు వెంకీ కుడుముల తో కూడా సినిమా చేయాల్సి ఉంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించేవారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలెక్కేలాగా కనిపించడం లేదు. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని వెంకీ హ్యాండిల్ చేయగలరా అని అనుమానాలు ఎప్పటినుండో కొందరిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వెంకీ కుడుముల తన కథతో చిరంజీవిని మెప్పించలేకపోయారు.

ఇప్పటికే చాలాసార్లు వెంకీ కుడుముల కథలో బోలెడు మార్పులు చేర్పులు చేసి మరి చిరంజీవికి వినిపించటం జరిగింది కానీ కథ ఏమాత్రం నచ్చకపోవడంతో చిరంజీవి చేసేది లేక ఈ సినిమాని తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ఈసారి మాత్రం తన సినిమా కథల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదని నిర్ణయించుకుని ఈ సినిమాకి నో చెప్పినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story