పునీత్ భౌతిక కాయం చూసి విలపించిన మెగాస్టార్.. కన్నీరు పెట్టుకున్న వెంకటేష్, ఆలీ, శ్రీకాంత్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోలుకోలేదు.

Arun Chilukuri
Published on: 30 Oct 2021 6:03 PM IST
పునీత్ భౌతిక కాయం చూసి విలపించిన మెగాస్టార్.. కన్నీరు పెట్టుకున్న వెంకటేష్, ఆలీ, శ్రీకాంత్
X

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోలుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోనూ అనేక మందితో పునీత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆకస్మిక మరణంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. పునీత్.. అతని కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకొని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ ను కడసారి చూసేందుకు తెలుగు సినీ ప్రముఖులు కదిలారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్, రానా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, అలీ కొద్దీ సేపటి క్రితమే బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్నారు. పునీత్ పార్ధీవదేహాన్ని సందర్శించిన చిరంజీవి, వెంకటేష్, అలీ, శ్రీకాంత్ నివాళులర్పించారు. పునీత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిన్న వయసులోనే పునీత్‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్‌ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్‌ అన్నారు. పునీత్‌ మరణం తీరని లోటన్న శ్రీకాంత్‌.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story