Lucifer Movie: 'లూసిఫర్' స్క్రిప్ట్ ‌పై చిరంజీవి అసంతృప్తి?

Chiranjeevi Unhappy with Lucifer Movie Remake
x
చిరంజీవి (ఫైల్ ఫొటో)
Highlights

Lucifer Movie: మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ చిత్రం "లూసిఫర్" ను రీమేక్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.

Lucifer Movie: మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ చిత్రం "లూసిఫర్" ను రీమేక్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులోకి డబ్ చేసి, థియేటర్లల్లో రిలీజ్ కూడా చేశారు. అయితే తెలుగులో రీమేక్ చేసేందుకు వి.వి.వినాయక్ స్క్రిప్ట్ మీద కొంతకాలం పనిచేశాడు. కానీ, వినాయక్ స్థానంలో మరో డైరెక్టర్ సుజీత్ వచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, చిరంజీవి రీమేక్ కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అలానే అఫీషీయల్ గా లాంచ్ కూడా చేశారు. ఆ తరువాత కూడా కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.

తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి ఫైనల్ స్క్రిప్ట్‌తో కూడా అసంతృప్తిగా ఉన్నాడంట. డైరెక్టర్ మోహన్ రాజాకు చాలా మార్పులను సూచించాడు మెగాస్టార్. కాగా, మోహన్ రాజా స్క్రిప్ట్‌ లో చాలా మార్పులు చేసినప్పటికీ చిరంజీవికి నచ్చలేదంట. ఈ మార్పులతో సినిమా ఓరిజినల్ కంటెంట్ మిస్ అవుతుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన "ఆచార్య" చిత్రీకరణ పూర్తయిన తర్వాత "లూసిఫర్" స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడానికి మెగాస్టార్ ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం "లూసిఫర్" రీమేక్ ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ నిర్మించనున్నారు. మోహన్ లాల్ నటించిన ఈ మలయాళ రీమేక్ కోసం "రారాజు", "కింగ్ మేకర్" టైటిల్స్ అనుకున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి "వేధాలం" రీమేక్, బాబీతో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories