
Chiranjeevi Tweet On Rajashekar : టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అయనకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయన, ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.
Chiranjeevi Tweet On Rajashekar : టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అయనకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయన, ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ తెలిపారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా, టాలీవుడ్ నటులు దేవుణ్ణి ప్రార్దిస్తున్నారు,
అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. డియర్ శివాత్మిక .. మీ నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అందరి ప్రార్ధనలతో రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి ముందు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని సోషల్ మీడియాలలో న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో దీనిపైన శివాత్మిక స్పందించారు.
ప్రస్తుతం నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. ఆయనకి మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు కావలి.. అవే ఆయనని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తార`ని శివాత్మిక పేర్కొంది. దయచేసి అసత్యపు ప్రచారాలు చేయొద్దు అని శివాత్మిక పేర్కొన్నారు.
అటు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు.
Dear @ShivathmikaR Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery. All our best wishes and prayers are with him and your family. Stay Strong. https://t.co/7vorNZ8VMK
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 22, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




