తారకరత్న ఆరోగ్యం పై మెగాస్టార్ ట్వీట్.. ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు..

Chiranjeevi: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 31 Jan 2023 10:12 AM IST
Chiranjeevi Tweet About Nandamuri Tarakaratna Health Update
X

తారకరత్న ఆరోగ్యం పై మెగాస్టార్ ట్వీట్.. ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు..

Chiranjeevi: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి ఊరటనిచ్చే విషయం చెప్పారు.

''సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారకరత్న నీకు ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story