Chiranjeevi Meet: వివాదంగా మారిన చిరంజీవి మీట్

Chiranjeevi Meet: టాలీవుడ్‌లోని కొంతమందితోనే మీటింగ్ పెట్టడంపై విమర్శలు తెలుగు సీఎంలతో ఇప్పటికే భేటీ అయిన చిరంజీవి

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 12:54 PM IST
Chiranjeevi Top Celebrities Meet Become Controversial in Tollywood
X

తెలుగు రాష్ట్రాల సీఎం లతో సమావేశం అయిన టాలీవుడ్ ప్రముఖులు (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi Meet: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నిర్వహించిన మీటింగ్ వివాదంగా మారుతోంది.. టాలీవుడ్‌లోని కొంతమందితోనే సమావేశం నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఆయన తదనంతరం ఆ బాధ్యతలను చిరంజీవి భుజాలకెత్తున్నాడు.. ఇండస్ట్రీ సమస్యలపై తెలుగు రాష్ర్టాల సీఎంలతో నేరుగా మాట్లాడే చనువు చిరంజీవి కి ఉంది.. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సినీ పరిశ్రమకు కావాల్సిన సబ్సిడిలు, సమస్యల పరిష్కారానికి చిరంజీవిని ఆహ్వానిస్తూ చర్చిస్తున్నారు. అదే ఇప్పుడు చిరంజీవికి తలనొప్పిగా మారింది.. గత ఆదివారం చిరంజీవి ఆయన నివాసంలో కొంతమందితో మాత్రమే సమావేశం నిర్వహించడం పట్ల చిన్న నిర్మాతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలతో చిరంజీవి పలుసార్లు సమావేశం అయ్యారు. దీనిపై ఓ వర్గం సీరియస్ గా ఉంది.. కానీ ఎక్కడ బయటపడలేదు కానీ తాజాగా జరిగిన మీటింగ్ పై నిర్మాత నట్టి కుమార్ హాట్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి అంటే గౌరవం, నమ్మకం ఉంది.. కానీ, విభజిస్తూ పాలిస్తున్నాడని దుయ్యపట్టారు.. ఫిల్మ్ ఇండస్ట్రీ.. అంటే మా అసోసియేషన్ కాదు, 24 శాఖలు ఉంటాయని గ్రహించాలని అన్నారు.. టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతలే కాదు. చిన్న నిర్మాతలు కూడా ఉన్నారని అన్నారు. మరి దాసరి నారాయణరావు లాగే చిరంజీవి కూడా అందరిని కలుపుకుని పోతడా.. లేదా అనేది చూడాలి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story