Sreeleela: ఈ బ్యూటీ లీలలు మాములుగా లేవు.. మెగాస్టార్ కూడా మెస్మరైజ్..!

Chiranjeevi to Romance With Sreeleela
x

ఈ బ్యూటీ లీలలు మాములుగా లేవు.. మెగాస్టార్ కూడా మెస్మరైజ్..

Highlights

Chiranjeevi Sreeleela: మన టాలీవుడ్ లో మల్లు లేదంటే ముంబై ముద్దుగుమ్మలదే హవా ఉండేది.

Chiranjeevi Sreeleela: మన టాలీవుడ్ లో మల్లు లేదంటే ముంబై ముద్దుగుమ్మలదే హవా ఉండేది. అయితే ఇప్పుడు వారి ప్లేస్ ని కన్నడ బ్యూటీలు ఆక్రమించేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో సరికొత్తగా ఎంట్రీ ఇస్తూ టాలీవుడ్ ఆడియెన్స్ కి మస్తు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు. మన ఇండస్ట్రీ ఇప్పుడు బ్యూటీస్ తో కళకళలాడిపోతోంది. ఇప్పటికే పూజా హెగ్డే, రష్మిక వంటి తారలు అగ్ర కథానాయికలుగా చక్రం తిప్పుతుంటే మరికొంత మంది వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అషికా రంగనాథ్, కావ్యా శెట్టి, శ్రీనిధి శెట్టి తమ గ్లామర్ టాలెంట్ తో రాణిస్తుంటే, కృతిశెట్టి వరుస ఆఫర్లు అందుకుంటోంది. వీరంతా ఒకెత్తైతే లాస్ట్ ఇయర్ మన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మరో శాండల్ వుడ్ బ్యూటీ శ్రీలీల రాబోయే కాలానికి కాబోయే నం.1 నాయికగా చక్రం తిప్పుతోంది.

పెళ్లి సందడి సినిమాలో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల టాలీవుడ్ లో లక్కీ ఛార్మ్ గా మారిపోయింది. అగ్ర హీరోల నుంచి యువ కథానాయకుల వరకు అందరూ శ్రీలీల నామం జపిస్తున్నారు. అగ్ర హీరో పవన్ కల్యాణ్ నుంచి కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి వరకు అందరూ శ్రీలీలతో ఆడిపాడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 లో శ్రీలీల నటిస్తోంది. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

అలాగే బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న NBK108 లో బాలయ్యకు చెల్లెలిగా కనిపించనుంది. ఇక యంగ్ హీరో రామ్ పోతినేని కలయికలో మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రంలో కూడా శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో యంగ్ హీరో నితిన్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో శ్రేష్ట మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రంలో కూడా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా ఈ కన్నడ బ్యూటీదే లీడ్ రోల్. విజయదేవరకొండ చిత్రంలో కూడా ఈమెనే కథానాయిక. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తన్న చిత్రంలో కూడా శీలలే హీరోయిన్. తెలుగులోనే కాకుండా కన్నడ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా ఈ ధమాకా బ్యూటీనే సందడి చేయనుంది. గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి సరసన కథానాయికగా నటిస్తోంది.

ఇక తాజాగా మెగా మూవీలో కూడా శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. మొత్తంగా, ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోయిన్స్ కంటే శ్రీలీల తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం, లక్కీ ఛార్మ్ గా పేరు రావడంతో టాలీవుడ్ నిర్మాతలు ఈ భామను పిలిచిమరీ అవకాశాలు ఇస్తున్నారు. మరి, స్టార్ హీరోయిన్లే కుళ్లుకునే రేంజ్ లో చేతి నిండా ప్రాజెక్టులతో ఉన్న శ్రీలీల..బాక్సాఫీస్ దగ్గర 3, 4 విజయాలు నమోదు చేస్తే కోటి కథానాయికగా ప్రమోషన్ కొట్టేయడమే కాదు టాలీవుడ్ టాప్ ఛైర్ ని కూడా సొంతం చేసుకోవడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories