Chiranjeevi: నాగార్జున సినిమాని నిర్మించనున్న మెగాస్టార్

Chiranjeevi: ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 9:30 PM IST
Chiranjeevi To Produce Nagarjuna-Akhil Movie?
X

Chiranjeevi: నాగార్జున సినిమాని నిర్మించనున్న మెగాస్టార్

Chiranjeevi: ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ముఖ్యపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సినిమా "లాల్ సింగ్ చద్దా" ను తెలుగులో ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్" తో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ రాజా ఇప్పుడు చిరంజీవికి ఒక మల్టీస్టారర్ కథను నేరేట్ చేశారట. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఈ సినిమా చేస్తే బాగుంటుందని మోహన్ రాజా అభిప్రాయం. అయితే కథ విన్న మెగాస్టార్ తమకంటే నాగార్జున మరియు అఖిల్ సినిమాకి బాగా సెట్ అవుతారని డైరెక్టర్ తో చెప్పారట. సినిమాలో స్టైలిష్ లుక్స్ ఉండటం ముఖ్యమని నాగార్జున అఖిల్ కాంబో అందులో బాగా వర్క్ అవుట్ అవుతుందని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి - చరణ్ కలిసి నటించిన "ఆచార్య" సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోవడంతో నాగార్జున అఖిల్ ను సంప్రదించమని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని స్వయంగా నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈ సినిమాకి సహా నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరి మోహన్ రాజా అఖిల్, నాగ్ ను తన మల్టీ స్టారర్ కథ తో ఎంత వరకు మప్పిస్తారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story