Movie News: కూతురు కోసం కథలు వింటున్న మెగాస్టార్..?

Chiranjeevi to Act for his Daughter Susmitha Konidela
x

Movie News: కూతురు కోసం కథలు వింటున్న మెగాస్టార్..?

Highlights

Chiranjeevi: సంక్రాంతికి విడుదల చేసిన వాల్తేరు వీరయ్య సక్సస్ తో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు.

Chiranjeevi: సంక్రాంతికి విడుదల చేసిన వాల్తేరు వీరయ్య సక్సస్ తో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. రెట్రో లుక్ కు మెగా అభిమానులతో పాటు సినీ ఫ్యాన్స్ సైతం బ్రహ్మరథం పట్టేయడంతో చిరు రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ మూవీని రెడీ చేసుకుంటున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, మహానటి ఫేం కీర్తి సురేష్..మెగాస్టార్ కు చెల్లెలుగా నటిస్తోంది.

ప్రస్తుతం భోళా శంకర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా మెగా స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట, జవాన్ డైరెక్టర్ బీవీఎస్ రవి దర్శకత్వంలో సినిమాలను ఓకే చేశారు. వీటిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తుండగా మెగా స్టార్ తన కూతురు సుష్మిత కెరీర్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ బ్యానర్ పై షూట్ ఎట్ ఆలేరు టైటిల్ తో వెబ్ సిరీస్, అలాగే సేనాపతి సినిమాను నిర్మించారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు సుస్మితకు నష్టాల్ని తెచ్చిపెట్టాయి. దీంతో సుస్మితను గట్టెక్కించేందుకు మెగా స్టార్ స్వయంగా రంగంలోకి దిగారట. తన కూతురి కోసం ఒక సినిమా చేయాలని..డిసైడ్ అయిన చిరంజీవి..కథలను సైతం వింటున్నారట.

మెగా స్టార్ దృష్టిలో ప్రస్తుతం ముగ్గురు దర్శకులు ఉన్నారట. వీరిలో ఒకరు వెంకీ కుడుముల కాగా మరొకరు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్, ఇక మరో దర్శకుడు సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల. ఈ ముగ్గురు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చడంతో డెవలప్ చేయలని చెప్పారట. ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరు బెటర్ ఔట్ కమ్ తో వస్తారో వారితో తన కూతురు సుస్మిత బ్యానర్ పై సినిమా చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ ఫ్యాన్స్ సుస్మితకు ఈసారి హిట్టు గ్యారెంటీ అంటున్నారు. ఎందుకంటే స్టోరీ జడ్జ్ మెంట్ తో చిరంజీవికి ఎదురే లేదు. మరి, వెంకీ కుడుముల, పీఎస్ మిత్రన్, కళ్యాణ్ కృష్ణ ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరు మెగాస్టార్ ను మెప్పిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories