ఇండస్ట్రీ విషయాల నుండి దూరంగా ఉంటున్న చిరంజీవి

Chiranjeevi Stay Away From Industry Matters
x

ఇండస్ట్రీ విషయాల నుండి దూరంగా ఉంటున్న చిరంజీవి

Highlights

Chiranjeevi: ఇండస్ట్రీ విషయాల నుంచి కనుమరుగైన మెగాస్టార్

Chiranjeevi: ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఐకమత్యం లేదని చెప్పుకోవచ్చు. కొందరు నిర్మాతలు కేవలం వారి సంగతి మాత్రమే చూసుకుంటూ మిగతా వారిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో అసలు ఇండస్ట్రీకి పెద్దదిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి ఎక్కడున్నారు అంటూ కొంతమందికి అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఇబ్బందులు కలిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరికంటే ముందు నిలబడి ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చిరంజీవి వాటిని కనీసం చూడను కూడా చూడటం లేదు.

మెగాస్టార్ కావాలని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండడానికి ఇష్టపడటం లేదని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి డిస్కషన్ చిరంజీవికి తెలుస్తుందని, ఇప్పటికే మా ఎన్నికలు సమయంలో మరియు టికెట్ రేట్లకు సంబంధించిన ఇష్యూలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న చిరంజీవి ఇప్పుడు తన పేరు బయటకు రాకుండా చూసుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు చిరంజీవి అసలు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటున్నారని దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతలను తప్ప వేరే వాళ్ళని పట్టించుకోవటం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories