Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్‌ భోజనం చేసేవాడు కాదు

Chiranjeevi: మెగా స్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్‌ చరణ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 2:43 PM IST
Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్‌ భోజనం చేసేవాడు కాదు
X

Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్‌ భోజనం చేసేవాడు కాదు

Chiranjeevi: మెగా స్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్‌ చరణ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు. చిరంజీవి కెరీర్లో హిట్‌ సినిమాలో ఒకటైన, ఎంతో స్పెషల్‌ అయిన సినిమా కొదమ సింహం నవంబర్‌ 21న రీ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా చిరంజీవి సినిమాతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

కొదమ సింహం సినిమాలో స్టిల్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. మొదటిసారి క్లీన్‌ షేవ్‌ కాకుండా గడ్డంతో చేసిన సినిమా ఇదేనని తెలిపారు. ఈ సినిమా తనకంటే చరణ్కి ఎక్కువ ఇష్టమని…అప్పట్లో రామ్ చరణ్‌ చిన్నప్పుడు వాళ్లమ్మ కొదమసింహం సినిమా క్యాసెట్ పెడితే కానీ భోజనం చేసేవాడు కాదని చెప్పారు. చిరు చరణ్ గురించి మాట్లాడిన ఈ మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story