Chiranjeevi: చిన్న సినిమాలు కూడా విజయవంతం కావాలి

Chiranjeevi: ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం

Rama Rao
Updated on: 10 Feb 2022 2:11 PM IST
Chiranjeevi said that he was very happy with the decision of CM Jagan
X

Chiranjeevi: చిన్న సినిమాలు కూడా విజయవంతం కావాలి

Chiranjeevi: సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పామన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని.. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story