వాల్తేరు వీరయ్య సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఒకే ఒక మాట అన్నారట

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమా చూశాక చిరంజీవి ఏమన్నారో తెలుసా..

Jyothi
Updated on: 25 Dec 2022 6:16 PM IST
Chiranjeevi Said Only One Thing After Watching Waltheru Veerayya Movie
X

వాల్తేరు వీరయ్య సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఒకే ఒక మాట అన్నారట

Waltair Veerayya: ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో పర్వాలేదు అనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి "వాల్తేరు వీరయ్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. "వెంకీ మామ" ఫేమ్ డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం బృందం సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలోనే నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు."జస్ట్ రెండు రోజుల ముందే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాని చూశారు. చూశాక కేవలం ఒకే ఒక్క మాట అన్నారు. ఇది ఒక డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నారు. ఇక ఆ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలై చిరు మాటలు నిజమవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను," అని అన్నారు బాబి.

మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా విషయంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు అభిమానులకు కూడా సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన సినిమా కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వబోతోంది. మరి వాల్తేరు వీరయ్య సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించి మెగాస్టార్ మాటలను నిజం చేస్తుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story