Chiru - Sampath Nandi: మెగాస్టార్ తో సినిమా చేయబోతున్న సంపత్ నంది

* రామ్ చరణ్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్న చిరంజీవి

admin1
Updated on: 9 Oct 2021 11:28 AM IST
Chiranjeevi Ready to act New Movie in Sampath Nandi Direction
X

మెగాస్టార్ తో సినిమా చేయబోతున్న సంపత్ నంది (ట్విట్టర్ ఫోటో)

Chiranjeevi - Sampath Nandi: ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పటికే బోలెడు ప్రాజెక్టును ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు లూసిఫర్ సినిమాతో కూడా బిజీగా ఉన్న మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి సైన్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో "వేదాళం" రీమేక్ అయిన "భోళా శంకర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు ఇప్పుడు మరొక దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు సంపత్ నంది.

"ఏమైంది ఈ వేళ" అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన సంపత్ నంది 2012 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి "రచ్చ" సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా క్లైమాక్స్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక క్యామియో పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన "సీటీమార్" అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంపత్ నంది ఇప్పుడు చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేశారట. కథ ఐడియా నచ్చిన చిరంజీవి మొత్తం స్క్రిప్ట్ డెవలప్ చేయమనగా, ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయారు సంపత్ నంది.

admin1

admin1

Next Story