Acharya: సూపర్ స్టార్ కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్

Acharya: సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri
Updated on: 22 April 2022 8:16 PM IST
Chiranjeevi, Ram Charan thank to Mahesh Babu
X

Acharya: సూపర్ స్టార్ కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్

Acharya: సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. చిరు-చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు వారు స్పష్టం చేశారు. మహేష్ గళంతో సినిమా మరింత ప్రత్యేకంగా మారనుందని మెగా హీరోలు తెలిపారు. పవర్‌ఫుల్ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. అయితే అభిమానుల నుంచి వస్తున్న వినతులపై తాజాగా చిరు స్పందించారు. డియర్ మహేష్..ఆచార్యలోని పాదఘట్టాన్ని నీ వాయిస్ ఓవర్‌తో అందరికీ పరిచయం చేస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఆచార్య ఈనెల 29న రిలీజ్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story