Yennai Arindhaal: మరొక తమిళ సినిమాని రీమేక్ చేస్తున్న చిరు..!?

* మరొక రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి

admin1
Updated on: 31 Aug 2021 3:23 PM IST
Chiranjeevi Planning to Remake The Tamil Movie Yennai Arindhaal
X

మరొక తమిళ సినిమాని రీమేక్ చేస్తున్న చిరు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Yennai Arindhaal Remake: దాదాపు ఒక దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి చిరంజీవి కేవలం రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. "ఖైదీ నెంబర్ 150" కూడా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "కత్తి" సినిమాకి రీమేక్ గా విడుదలైంది. ఈ మధ్యనే "సైరా" సినిమాతో హిట్ అందుకున్న చిరు ఇప్పుడు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత చిరంజీవి తమిళంలో అజిత్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన వేదాళం సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో రీమేక్ సినిమాకి సైన్ చేశారు. 2015 లో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "ఏర్నై అరిందాల్" అని తమిళ సినిమాని చిరంజీవి రీమేక్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి లేదా వెంకీ కుడుములలో ఎవరో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story