ప్రతి పండగకి విడుదలను ప్లాన్ చేసిన మెగాస్టార్

*ప్రతి పండగకి విడుదలను ప్లాన్ చేసిన మెగాస్టార్

Rama Rao
Published on: 23 Jun 2022 7:19 AM IST
Chiranjeevi Planned the Release of The Film for Every Festival
X

ప్రతి పండగకి విడుదలను ప్లాన్ చేసిన మెగాస్టార్

Chiranjeevi: కొరటాల శివ దర్శకత్వం వహించిన "ఆచార్య" సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పెద్ద డిజాస్టర్ అందుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ మెగాస్టార్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ గ్యాప్ తో తన సినిమాలను వరుసగా విడుదల చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "గాడ్ ఫాదర్". మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.మరోవైపు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ "వాల్తేరు వీరయ్య" అనే సినిమా షూటింగ్ తో కూడా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా మెహర్ రమేష్ డైరెక్షన్ లో "భోళా శంకర్" సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

అయితే "గాడ్ ఫాదర్" ఈ ఏడాది దసరా సందర్భంగా "వాల్తేరు వీరయ్య" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా మరియు "భోళా శంకర్" సినిమా వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో రాబోతున్న మూడు పెద్ద పండగలకి మెగాస్టార్ తన సినిమాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story