చిరంజీవి పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Pasivadi Pranam: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలలో "పసివాడి ప్రాణం" కూడా ఒకటి.

Arun Chilukuri
Published on: 16 March 2023 4:42 PM IST
Chiranjeevi Pasivadi Pranam Movie Child Artist Sujitha Whats Doing Now
X

చిరంజీవి పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Pasivadi Pranam: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలలో "పసివాడి ప్రాణం" కూడా ఒకటి. డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయశాంతి మరియు సుమలతలు హీరోయిన్లుగా నటించారు. గీత ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని స్వయంగా నిర్మించారు. ఈ సినిమా కథ ఒక చెవిటి పిల్లవాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులను చంపేసిన విలన్స్ ఆ పిల్లాణ్ణి కూడా చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అనుకోకుండా ఆ బాబు చిరంజీవి వద్దకు వస్తాడు. ఆ తరువాత చిరంజీవి జీవితం ఎలా మారింది, ఆ బాబు వెనుక పడుతున్న విలన్లు ఎవరు, వారి నుంచి ఆ బాబుని చిరంజీవి కాపాడగలిగారా? అనేదాని చుట్టూ ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది. ఇంతకీ ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అబ్బాయి కాదు అమ్మాయి. ఆమె సీరియల్ నటి సుజిత.

తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, వంటి సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించిన ఈమె గత కొద్ది రోజులుగా బుల్లితెర సీరియల్స్ తో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "జై చిరంజీవ" సినిమాలో ఈమె చిరంజీవి చెల్లెలి పాత్రలో కూడా కనిపించింది. తాజాగా "వదినమ్మ" సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుజిత ధనుష్ అనే డిజైనర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఒకవైపు బుల్లితెర మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో సుజిత యాక్టివ్ గానే ఉంటుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story