Chiru - Meher: యాక్షన్ సీన్స్ కోసం మెహర్ రమేష్ ను రంగంలోకి దింపిన చిరు

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 9:45 PM IST
Chiranjeevi Offered Meher Ramesh to Compose Action Scenes in Lucifer Remake
X

చిరంజీవి - మెహర్ రమేష్ (ఫైల్ ఫోటో)

Chiranjeevi - Meher Ramesh: కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో నయనతార మరియు సత్య దేవ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం ఒరిజినల్ సినిమా కు దర్శకత్వం వహించిన జయమ్ రాజా ను రంగంలోకి దింపారు దర్శకనిర్మాతలు. అయితే జయం రవి కంపోస్ట్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు చిరంజీవికి అంత సంతృప్తికరంగా అనిపించటం లేదట.

చిరంజీవి వయసుకు తగ్గట్టుగా ఫైట్స్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు కానీ మెగాస్టార్ మాత్రం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా తానే స్వయంగా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని కేవలం యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కోసం మెగాస్టార్ మెహర్ రమేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జయం రాజా తో పోలిస్తే మెహర్ రమేష్ యాక్షన్ సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేయడంలో దిట్ట అని చెప్పుకోవాలి. అందుకని ఈ బాధ్యతను మెగాస్టార్ మెహర్ రమేష్ కు ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story