కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చిరు కొత్త సినిమా?

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చిరు కొత్త సినిమా?
x
Highlights

మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి కొన్ని సన్నివేశాలలో గుండుతో కనిపించనున్నారట. అందుకోసం ఆమధ్య గుండు గెటప్ తో కూడా మేకప్ టెస్టులు కూడా చేశారు మేకర్స్..

గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. మెగస్టార్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా తరవాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని కలకత్తా నగర నేపథ్యం వుంటుందట. సినిమాలో ఎక్కువ భాగాన్ని అక్కడే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి కొన్ని సన్నివేశాలలో గుండుతో కనిపించనున్నారట. అందుకోసం ఆమధ్య గుండు గెటప్ తో కూడా మేకప్ టెస్టులు కూడా చేశారు మేకర్స్.. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అటు గతంలో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి చూడాలని ఉంది సినిమాని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories