Chiranjeevi: మరొక సినిమాని ప్రకటించిన మెగాస్టార్

Chiranjeevi: వెంకీ కుడుముల తో సినిమా ప్రకటించిన చిరంజీవి

admin1
Published on: 14 Dec 2021 6:04 PM IST
Chiranjeevi Next Film with Director Venky Kudumula And Producer DVV Danayya | Tollywood News
X

మరొక సినిమాని ప్రకటించిన మెగాస్టార్(ఫైల్-ఫోటో)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ వరుస షూటింగ్లతో బిజీకాబోతున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ హీరోగా మలయాళం సినిమా "లూసిఫర్" రీమేక్ అయిన "గాడ్ ఫాదర్" షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. మరోవైపు "భోళా శంకర్" సినిమా కూడా సైన్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొకటి లైన్ లో పెట్టారు.

తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తో పాటు అయ్యప్ప మాల లో చిరు, వెంకీ కుడుముల మరియు నిర్మాత దానయ్య ఉన్న ఫోటో ను కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. #చిరు156 అని పిలవబడుతున్న ఈ సినిమాకి యువ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటిదాకా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సినిమాలు రెండే.

ఒకటి "చలో" మరొకటి "భీష్మ". ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇక చిరు తో వెంకీ సినిమా ఎలా ఉండబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. "ఆర్ఆర్ఆర్" సినిమాను నిర్మించిన డీ వీ వీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story