Chiranjeevi New Movie: హీరో-అభిమానికి మధ్య జరిగే కథతో చిరు-బాబీల మూవీ

admin1
Updated on: 3 Aug 2021 4:16 PM IST
Chiranjeevi New Movie With Venky Mama Director KS Ravindra
X

KS Ravindra: చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన 'వెంకీ మామ' దర్శకుడు

Chiranjeevi New Movie: కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు సినిమాలు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' సినిమా రీమేక్ లో నటించనున్న మెగాస్టార్ ఈ మధ్యనే 'వెంకీ మామ' సినిమా తో ప్రేక్షకులను అలరించిన కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్ర పోషించనున్నారు? ఈ సినిమా కథ దేని చుట్టూ తిరగనుంది? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు బాబి. "ఈ సినిమా ఒక స్టార్ హీరోకి అతని అభిమానికి మధ్య జరిగే కథ" అని ఒక్కముక్కలో తేల్చి చెప్పేశారు బాబి. అంతేకాక "చిన్నప్పట్నుంచి నేను చిరంజీవి కి వీరాభిమానిని. ఒక అభిమానిగా ఆయనను తెరపై ఎలా చూడాలనుకుంటున్నానో ఈ సినిమా అలా ఉంటుంది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూసి నేనెలా చప్పట్లు కొట్టాను ఈ సినిమా కూడా అలానే ఉండబోతోంది. ఈ కథ చెప్పిన వెంటనే చిరు ఓకే అన్నారు," అని చెప్పుకొచ్చాడు.

admin1

admin1

Next Story