Chiranjeevi: పవన్ కళ్యాణ్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మెగాస్టార్

Chiranjeevi: పవన్ కళ్యాణ్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మెగాస్టార్

Rama Rao
Published on: 15 Jun 2022 5:30 PM IST
Chiranjeevi Movie With Director KS Ravindra | Tollywood News
X

Chiranjeevi: పవన్ కళ్యాణ్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మెగాస్టార్ 

Chiranjeevi: ఈ మధ్యనే కొరటాల శివ డైరెక్షన్లో "ఆచార్య" సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న ఆ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో బాగానే బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమా కి తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "గాడ్ ఫాదర్" సినిమాలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి.

మోహన్ రాజా ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు "భోళా శంకర్" సినిమాతో కూడా బిజీగా ఉన్న మెగాస్టార్ మరోవైపు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో "వాల్తేరు వీరయ్య" అనే ఒక సినిమా సైన్ చేశారు. ఇంకా చిరంజీవి జాయిన్ కాకపోయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం గత పది రోజులుగా జరుగుతుంది. తాజాగా చిరంజీవి కూడా షూటింగ్లో పాల్గొనడం మొదలు పెట్టారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబీ దర్శకత్వంలో నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. ఇక తమ్ముడికి మంచి హిట్ ఇవ్వలేని ఈ డైరెక్టర్ చిరంజీవి కి మాత్రం ఎంత వరకు హిట్ ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా మెగాస్టార్ మాత్రం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల అయ్యేలా బాగానే ప్లాన్ చేస్తున్నారు అని కొందరు అభిమానులు సంతోషిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story