గరికపాటి విషయంలో సైలెంట్ గా ఉన్న చిరంజీవి

Chiranjeevi is Silent on Garikipati Narasimha Rao
x

గరికపాటి విషయంలో సైలెంట్ గా ఉన్న చిరంజీవి

Highlights

*గరికపాటి విషయంలో సైలెంట్ గా ఉన్న చిరంజీవి

Chiranjeevi-Garikipati: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి తెలుగు రీమేక్ గా విడుదలైన ఈ సినిమా చిరంజీవికి మంచి హిట్ అవ్వడం ఇవ్వడంతో పాటు అభిమానులకు కూడా కొంత ఊరట ఇచ్చింది. అయితే తాజాగా గరికపాటి ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు అభిమానులను కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. చిరంజీవి దృష్టిలో పడాలి అనే కుతూహలంతో చాలామంది ఇప్పుడు గరికపాటి పై చతుర్లు మొదలుపెట్టారు.

సినిమా సక్సెస్ మీట్ లో కూడా చోటా, అనంత శ్రీరామ్, బాబి వంటి వారు గరికపాటి కి వ్యతిరేకంగా రెచ్చిపోయారు. కానీ ఇదంతా చూసిన మెగాస్టార్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఆ తర్వాత వర్మ కూడా వర్మ తనదైన శైలిలో ట్విట్టర్లో గరికపాటి పై వెటకారం చేశారు. సోషల్ మీడియాలో కూడా గరికపాటి పై నెగిటివిటీ బాగా పెరుగుతూ వస్తోంది. ఇటువంటి సమయంలోనే తన అభిమానులను శాంతించమని చిరంజీవి చెబితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతైనా గరికపాటి ఒక పెద్ద పండితుడు. ఏదో పొరపాటున నోరు జారాడు అని అతనిని క్షమించి తన మెగా మనసు తో చిరంజీవి అభిమానులను శాంతింప చేస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories