GodFather - Chiranjeevi: ''గాడ్ ఫాదర్" కోసం ఊటీ వెళ్లనున్న చిరంజీవి

* మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసీఫర్" సినిమాను రీమేక్ చేసి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను ఖరారు చేశారు.

admin1
Updated on: 23 Sept 2021 12:15 PM IST
GodFather Movie Update: Chiranjeevi is Going to Ooty for Godfather Movie Shooting
X

ఊటీలో షూటింగ్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి (ఫోటో- ది హన్స్ ఇండియా )

GodFather - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "లవ్ స్టోరీ" సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు సైమా అవార్డ్స్ ఫంక్షన్ లకు ముఖ్యఅతిథిగా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చిరంజీవి త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసీఫర్" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఊటీలో జరగబోతోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ కోసమే చిరంజీవి ఊటీ పయనమవ్వబోతున్నారు. ఇక "ఆచార్య" మరియు "గాడ్ ఫాదర్" సినిమాలు కాకుండా మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన "వేదాలం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "భోళా శంకర్" అనే టైటిల్ ని ఖరారు చేశారు. మరోవైపు చిరంజీవి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story