నాగచైతన్య డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న చిరంజీవి?

* బంగార్రాజు డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా ఉంటుందా?

Dhatripriya
Updated on: 16 Feb 2023 9:31 PM IST
Chiranjeevi Is Going To Make A Film With Naga Chaitanya Director
X

నాగచైతన్య డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న చిరంజీవి?

Kalyan Krishna: యువ హీరో నాగచైతన్య హీరోగా "రారండోయ్ వేడుక చూద్దాం", టాలీవుడ్ కింగ్ నాగార్జున తో "సోగ్గాడే చిన్నినాయన" వంటి సూపర్ హిట్ సినిమాలు తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. ఈ మధ్యనే కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య మరియు నాగార్జునలతో కలిసి బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొంత నిరాశపరిచిందనే చెప్పుకోవాలి.

ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక మంచి కథని రెడీ చేసుకున్నారట. ఈ నేపథ్యంలోని చిరంజీవికి కథ చెప్పటం కోసం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట.

నిజానికి కళ్యాణ్ కృష్ణ మరియు చిరంజీవి ల కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కళ్యాణ్ కృష్ణ అన్నయ్య కురసాల కన్నబాబు పార్టీలో చేరారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక మరోవైపు చిరంజీవి "భోళా శంకర్" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వీలు దొరికినప్పుడు కళ్యాణ్ కృష్ణ చిరంజీవికి ఒక కథని నెరేట్ చేయబోతున్నారు. మరి చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story