పవర్ స్టార్ ఫ్యాన్ అయిన చిరంజీవి.. నిరాశలో చిరు ఫ్యాన్స్..

* పవన్ కళ్యాణ్ అభిమాని గా కనిపించనున్న మెగాస్టార్

Dhatripriya
Published on: 21 Feb 2023 3:29 PM IST
Chiranjeevi Is A Fan Of Pawan Kalyan
X

పవర్ స్టార్ ఫ్యాన్ అయిన చిరంజీవి.. నిరాశలో చిరు ఫ్యాన్స్..

Chiranjeevi: కొన్ని కొన్ని సార్లు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగే వార్ లు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని రోజూ ఎవరో ఒకరి మధ్య ఫ్యాన్ వార్ లు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణ కు ఈ మధ్యనే రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఒకటి జరిగింది. ఇక "ఆర్ ఆర్ ఆర్" క్రెడిట్ కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య గొడవ సినిమా విడుదల అయినప్పటి నుండి జరుగుతూనే ఉంది.

తాజాగా ఇప్పుడు మరొక ఫ్యాన్ వార్ తెరపైకి వచ్చింది. ఈసారి గొడవ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు "భోళా శంకర్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చిచ్చు మొదలు పెట్టింది. సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా చిరు పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్ కూడా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్త తో చిరు అభిమానులు కలత చెందుతున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ అభిమానిగా చూపించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పైగా మెగాస్టార్ అయిన చిరంజీవి ఒక్క సినిమా కోసం పవన్ కళ్యాణ్ బ్రాండ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ చిరు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవి తమ్ముడు. ఈ అన్నదమ్ముల మధ్య అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్యాన్స్ కూడా కూల్ గా ఉంటే బెటర్ అని మరి కొందరు చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story