Chiranjeevi: జర్నలిస్టు భరత్ భూషణ్ కు చిరు సాయం

Chiranjeevi: క‌రోనా వైర‌స్ రెండో ద‌శ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది.

Arun Chilukuri
Updated on: 23 May 2021 6:00 PM IST
Chiranjeevi Helps Photo Journalist Bharath Bhushan
X

Chiranjeevi: జర్నలిస్టు భరత్ భూషణ్ కు చిరు సాయం

Chiranjeevi: క‌రోనా వైర‌స్ రెండో ద‌శ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దాటికి ప్ర‌జ‌లు విల‌విలలాడిపోతున్నారు. ఇంట్టో నుంచి అడుగుబ‌య‌ట పెట్టాలంటేనే జంక్కుతున్నారు. క‌రోనా కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ కూడా కుదేల‌వుతుంది. సీనీ కార్మికులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ క‌ష్టకాలంలో ఆదుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత కొన్నిరోజుల వ్యవధిలోనే అనేకమందికి చెక్ లు అందజేశారు. తాజాగా, సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు ఆర్థికసాయం అందించారు.

భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫొటో జ‌ర్న‌లిస్ట్ అనారోగ్యంతో బాధపడుతూ.. తనని ఆదుకోవాల‌ని కోర‌గా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్‌కి అందజేశారు. చిరు సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ.. ఆప‌ద్బాంధవుడిలా ఈ క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో సాయం చేస్తున్న చిరంజీవిగారు.. క‌ష్టంలో మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌ మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story