అభిమాని కుమార్తెకి మెగాస్టార్ లక్ష రూపాయల సాయం!

అభిమాని కుమార్తెకి మెగాస్టార్ లక్ష రూపాయల సాయం!
x
Highlights

అభిమానుల విషయంలో మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన అభిమాని తన కూతురు పెళ్లి విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే రూ. లక్ష సాయం చేశారు.

అభిమానుల విషయంలో మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన అభిమాని తన కూతురు పెళ్లి విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే రూ. లక్ష సాయం చేశారు. మహబూబాబాద్‌కు చెందిన భువనగిరి శేఖర్‌ అనే వ్యక్తి స్థానికంగా మిర్చి బండి పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే శేఖర్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమానిగా ఉన్నాడు.

చిరంజీవికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శేఖర్‌ కుమార్తెకి ఇటీవల వివాహం కుదిరింది. ఈ క్రమంలో తన కుమార్తె పెళ్లి చేయడానికి శేఖర్‌ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మెగాస్టార్ యూత్ సభ్యులు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపైన వెంటనే స్పందించిన చిరు రూ. లక్ష సహాయం చేశారు.

ఈ మేరకు చిరు బ్లడ్‌బ్యాంక్‌ సీఈవో స్వామినాయుడు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ శేఖర్‌ కుటుంబసభ్యుల్ని కలిసి రూ.లక్ష చెక్కును అందించారు. ఈ సందర్బంగా శేఖర్ మాట్లాడుతూ నా ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుని సాయం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories