చిరు గ్రీన్ సిగ్నల్.. మెగాస్టార్ తో చేతులు కలపనున్న పూరి జగన్నాథ్..

Puri Jagannath: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Arun Chilukuri
Updated on: 8 Dec 2022 9:30 PM IST
Chirnajeevi Green Signal To Puri Jagannadh Story
X

చిరు గ్రీన్ సిగ్నల్.. మెగాస్టార్ తో చేతులు కలపనున్న పూరి జగన్నాథ్..

Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా ఇప్పుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే చిరంజీవిని కలిసిన పూరి జగన్నాథ్ ఒక మంచి కథ ను వినిపించారని చిరంజీవికి కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.

నిజానికి పూరి జగన్నాథ్ మరియు చిరంజీవి కాంబినేషన్లో ఇప్పటికే ఒక సినిమా రావాల్సింది "ఆటో జానీ" అనే టైటిల్ ను కూడా ఈ సినిమాకి ఖరారు చేశారు కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అయింది. పూరి జగన్నాథ్ మరియు చిరంజీవిల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉంది. రామ్ చరణ్ ను కూడా హీరోగా "చిరుత" సినిమాతో లాంచ్ చేసింది పూరి జగన్నాథ్. ఈ మధ్యనే మెగాస్టార్ హీరోగా నటించిన "గాడ్ ఫాదర్" సినిమాలో కూడా పూరి జగన్నాథ్ ఒక చిన్న కామియో పాత్రలో కనిపించారు.

ఆ సినిమా సమయం తర్వాత నుంచి వీరిద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పూరి మార్క్ హీరో క్యారెక్టర్రైజేషన్ తో ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు చిరంజీవి కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్ లో నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story