Chiranjeevi New Movie: మెహర్ రమేష్ ను పక్కన పెట్టిన మెగాస్టార్

* ముందు బాబీ ను లైన్ లో పెట్టిన చిరంజీవి

admin1
Published on: 25 Oct 2021 5:00 PM IST
Chiranjeevi Gives First Priority to Director KS Ravindra
X

మెహర్ రమేష్ ను పక్కన పెట్టిన మెగాస్టార్(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Chiranjeevi New Movie: సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు గాడ్ ఫాదర్ మరియు "భోళా శంకర్" సినిమాలకి కూడా సైన్ చేశారు. ఇందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "భోళా శంకర్".

చిరు సైన్ చేసిన మ‌రో సినిమా డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి కూడా తెలిసిందే. నిజానికి మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆ తరువాతే లైన్లోకి వచ్చాడు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి. కానీ తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మాత్రం ముందుగా బాబీ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ఆ సినిమా పూర్తయిన తర్వాత మెహర్ రమేష్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" సినిమాతో బిజీగా ఉన్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసిఫర్" కి రీమేక్ గా చిత్రం తెరకెక్కనుంది. "భోళా శంకర్" కూడా త‌మిళ చిత్రం "వేదాళం"కు రీమేక్‌. ఇలా రెండు వ‌రుస రీమేక్ సినిమాలు చేయడం మంచిది కాదని భావించిన చిరంజీవి మెహ‌ర్ ర‌మేశ్‌ను మ‌రికొన్నిరోజులు వెయిట్ చేయ‌మ‌ని చెప్పి, బాబీ సినిమాను లైన్ లో పెట్టారు.

admin1

admin1

Next Story