Chiranjeevi: కళ్యాణ్ కృష్ణ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ తో సినిమా చేయబోతున్న అక్కినేని డైరెక్టర్

Jyothi
Published on: 20 April 2023 3:00 PM IST
Chiranjeevi Gave the Green Signal for the Movie with Kalyan Krishna
X

Chiranjeevi: కళ్యాణ్ కృష్ణ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సినిమాల స్పీడు బాగానే పెంచారు. ఒకదాని తర్వాత మరొక సినిమాని విడుదల చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. తాజాగా ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో చేతులు కలపనున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో "బింబిసార" ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌ మల్లిడి చిరంజీవిని తన కథతో ఇంప్రెస్ చేశారు.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అయితే చిరంజీవి ఇప్పుడు మరొక యువ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అక్కినేని హీరోలతో "సోగ్గాడే చిన్నినాయన", "బంగార్రాజు", "రారండోయ్ వేడుక చూద్దాం" వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల.

ఈ మధ్యనే కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ ని కలిసి ఒక కథను వినిపించారట. అయితే ఇది సొంతంగా తాను రాసుకున్న కథ కాదు. కానీ ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ అందించిన కథ. చిరంజీవికి ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసారని తెలుస్తోంది. ఆగస్టు నుంచి వశిష్ట తో సినిమా మొదలు పెట్టబోతున్న చిరంజీవి ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story