వరుణ్ తేజ్ బాధ్యతను తనపై వేసుకున్న చిరంజీవి

Chiranjeevi: ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా కథ కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.

Arun Chilukuri
Updated on: 21 April 2022 3:24 PM IST
Chiranjeevi Focused on Commercial Project for Varun Tej
X

వరుణ్ తేజ్ బాధ్యతను తనపై వేసుకున్న చిరంజీవి

Chiranjeevi: ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా కథ కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దర్శకులు కలిసి కమర్షియల్ కథలను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి కమర్షియల్ కథను వెతుకుతోంది తన కోసం కాదట వరుణ్ తేజ్ కోసం. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ ఇప్పటిదాకా ఒక మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నది లేదు.

ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్ హీరోగా విడుదలైన గని సినిమా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. ఇక ఎలాగైనా వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఒక కమర్షియల్ హిట్ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ కూడా వరుణ్ తేజ్ కి సహాయం చేసే పనిలో పడ్డారు. వరుణ్ తేజ్ బాధ్యతలు తీసుకున్న చిరంజీవి ఇప్పుడు వరుణ్ తేజ్ కోసం ఒక కమర్షియల్ కథను వెతుకుతున్నారు. ఇప్పటిదాకా వరుణ్ బాధ్యత అల్లు అరవింద్ మరియు కుటుంబం తీసుకుంది.

కానీ ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో లేకపోయేసరికి మెగాస్టార్ స్వయంగా వరుణ్ తేజ్ కెరీర్ ను గాడిలోకి తీసుకువచ్చే బాధ్యత స్వీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేసింది లేదు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story