డ‌బుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్‌.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..

Chiranjeevi First Guest Of Balakrishnas Unstoppable Season 2
x

డ‌బుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్‌.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..

Highlights

AHA Unstoppable: మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లను టాలీవుడ్ కి ఉన్న రెండు కళ్లు అని చెప్పుకోవచ్చు.

AHA Unstoppable: మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లను టాలీవుడ్ కి ఉన్న రెండు కళ్లు అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరోలు వీరే. ఇప్పటికి కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వారు ఒకరితో ఒకరు మాట్లాడకవట్లేదు అంటూ ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక స్టేజ్ మీద లేదా తెరపైన కనిపించింది కూడా చాలా తక్కువ అని చెప్పాలి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "అన్‌స్టాపబుల్‌" షోతో హోస్ట్ వా మారిపోయారు నందమూరి బాలకృష్ణ. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో అతి త్వరలోనే ఈ షోకి సెకండ్ సీజన్ మొదలు కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం రెండవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ఎపిసోడ్ కి భారీగా వ్యూస్ వస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ ని బుల్లితెరపై చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ షో లో బాలయ్య ఫన్నీ మరియు జోవియల్ ఇంటర్వ్యూల వల్ల బాలయ్య కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ షో రెండో సీజన్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories