Sivasankar Health Update: శివశంకర్‌ మాస్టర్‌ చికిత్సకు మెగాస్టార్‌ ఆర్థికసాయం

* రూ.3లక్షల చెక్‌ అందజేసిన చిరంజీవి * శివశంకర్‌ పరిస్థితి విషమంగానే ఉంది -అజయ్‌ కృష్ణ

Shilpa
Updated on: 27 Nov 2021 4:49 PM IST
Chiranjeevi Financial Help of Rs 3 Lakh for Sivasankar Master Treatment
X

శివశంకర్‌ మాస్టర్‌ చికిత్సకు మెగాస్టార్‌ ఆర్థికసాయం(ఫైల్ ఫోటో)

Sivasankar Health Update: కరోనా బారిన పడిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు ఆయన చిన్న కుమారుడు అజయ్‌ కృష్ణ తెలిపారు. ఏఐజీ హాస్పిటల్‌ వైద్యులు మాస్టర్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు.

సినీ ప్రముఖులు పలువురు ఫోన్ చేసి మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. తమవంతు సహాయాన్ని కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఇక మాస్టర్‌ చికిత్స కోసం మెగాస్టార్‌ చిరంజీవి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

Shilpa

Shilpa

Next Story